భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు.
తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్‌లో 561, తెలంగాణలో 487, మధ్యప్రదేశ్‌లో 451, ఉత్తరప్రదేశ్‌లో 433, ఏపీలో 381, గుజరాత్‌లో 378, కేరళలో 364, జమ్మూకశ్మీర్‌లో 207, కర్ణాటకలో 207, హర్యానాలో 176, పంజాబ్‌లో 151,
బెంగాల్‌లో 116, బీహార్‌లో 60, ఒడిశాలో 50, ఉత్తరాఖండ్‌లో 35, అసోంలో 29, హిమాచల్‌ప్రదేశ్‌లో 28, చండీఘర్‌లో 19, ఛత్తీస్‌గఢ్‌లో 18, లడఖ్‌లో 15, జార్ఖండ్‌లో 14, అండమాన్ నికోబార్ దీవుల్లో 11, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్ హవేలి, మిజోరాంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.