కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది.
దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు.
తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్‌లో 561, తెలంగాణలో 487, మధ్యప్రదేశ్‌లో 451, ఉత్తరప్రదేశ్‌లో 433, ఏపీలో 381, గుజరాత్‌లో 378, కేరళలో 364, జమ్మూకశ్మీర్‌లో 207, కర్ణాటకలో 207, హర్యానాలో 176, పంజాబ్‌లో 151, బెంగాల్‌లో 116, బీహార్‌లో 60,
ఒడిశాలో 50, ఉత్తరాఖండ్‌లో 35, అసోంలో 29, హిమాచల్‌ప్రదేశ్‌లో 28, చండీఘర్‌లో 19, ఛత్తీస్‌గఢ్‌లో 18, లడఖ్‌లో 15, జార్ఖండ్‌లో 14, అండమాన్ నికోబార్ దీవుల్లో 11, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్ హవేలి, మిజోరాంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.