కరోనా మహమ్మారి మొదటిగా చైనాలో వ్యాప్తిచెందిన సంగతి విదితమే.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ భారీన పదహారు లక్షల మంది పడ్డారు.ఈ క్రమంలో చైనా మాస్కులంటేనే ప్రపంచ దేశాలు గజగజవణుకుతున్నాయి.
తాజాగా కరోనా నియంత్రణ వైద్య సిబ్బంది కోసం చైనా నుండి తెప్పించుకున్న మాస్కులు సురక్షితం కాదు అని ఫిన్లాండ్ తేల్చి చెప్పింది.మాస్కులు నిర్ణీత రక్షణ ప్రమాణాలను పాటించి ఆ మాస్కులను తయారుచేయలేదు అని ఆ దేశం ప్రకటించింది.
చైనా నుండి దిగుమతి చేసుకున్న 2లక్షల సర్జికల్ మాస్కులు,2.3లక్షల రెస్పిరేటర్ మాస్కులను వాడే ముందు పరిశీలించాలని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఐనో కైసా ఆదేశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.