తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 471కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన సంగతి విదితమే.ఢిల్లీ మర్కజ్ సంఘటనతో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయిన సంగతి విదితమే.
కరోనా నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపాలిటీ,వైద్య సిబ్బందిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి విదితమే.వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలో పది శాతం అదనంగా వేస్తామని ప్రకటించారు.
జీహెచ్ఎంసీ సిబ్బందికి ఏడున్నర వేలు ఇస్తామని అన్నారు.ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులకు సీఎం కానుకగా స్పెషల్ ఇన్సెంటివ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో పాల్గోంటున్న ప్రతి కార్మికుడి ఖాతాలో ఈ రోజు నుండి ఐదు వేలను జమచేయనున్నారు.ఇందుకు ప్రభుత్వం రూ.21.84కోట్లను విడుదల చేసింది.