Home / SLIDER / మానవతా మూర్తుల సాయం మరువ లేనిది..

మానవతా మూర్తుల సాయం మరువ లేనిది..

కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారుతు.. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారని., ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధిపేటకు చెందిన యాదవ సంఘం లక్ష రూపాయలు , ప్రముఖ వైద్యులు కొండా శ్రీనివాస్ తేజ హాస్పిటల్స్ లక్ష రూపాయలు , నర్సింగా రావు సరేదన్ మహీంద్రా మోటార్స్ లక్ష రూపాయలు , గన్నమనేని శ్రీదేవి- చందర్ రావు ఎంపీపీ సిద్దిపేట లక్ష రూపాయలు , సిద్దిపేట ప్రముఖ విద్యాసంస్థ బి ఎం ఆర్ – మెరిడియాన్ విద్యాసంస్థల తరుపున 50వేల రూపాయలు , శ్రీనిధి కన్ స్ట్రక్షన్ అమరెందర్ రెడ్డి 25వేల రూపాయలు విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన వారిని మంత్రి హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా అభినందించారు..కరోనా నివారణ తర్వాత ఔదార్యం చూపిన దాతృత్వం తో సహాయం చేసిన మానవతా మూర్తులను సన్మానిస్తమని చెప్పారు..

– సిద్దిపేట యాదవ సంఘం లక్ష రూపాయలు విరాళం..

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ తమవంతు సాయంగా మంత్రి నివాసంలో సిద్దిపేట యాదవ సంఘం పక్షాన ప్రతినిధులు శ్రీహరి యాదవ్, దువ్వాల మల్లయ్య , కౌన్సిలర్ ఐలయ్య యాదవ్ తదితరులు లక్ష చెక్కును మంత్రికి అందజేశారు.. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులను అభినందించారు.

– తేజ హాస్పిటల్ పక్షాన లక్ష రూపాయలు విరాళం..

సిద్ధిపేటలోని ప్రముఖ వైద్యులు డా.కొండ శ్రీనివాస్ మానవత్వంతో ముందుకొచ్చారు. మంత్రి నివాసంలో హరీష్ రావు గారు ప్రతి రోజు కరోనా పై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరగడం పట్ల హ్యాట్సాప్ అని చెప్పారు.ప్రభుత్వం , మీరు చేస్తున్న కృషిని చూస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు.. ఈ సందర్భంగా మేము మా తేజ హాస్పిటల్ కూడా 1లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తున్నాను మంత్రి చెప్పారు సంబంధిత చెక్ ను మంత్రి హరీష్ రావు గారికి అందజేశారు…

– సరేదాన్ మహీంద్రా మోటార్స్ లక్ష రూపాయలు విరాళం

సిద్ధిపేటలోని మహీంద్రా మోటార్స్ తరుపున కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నా ప్రభుత్వంకు పేదల సహాయం కొరకు వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నట్లు మేనేజర్ నర్సింగా రావు అన్నారు ఈ సందర్భంగా లక్ష రూపాయలు చెక్కును మంత్రి నివాసంలో మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.

– బి ఎం ఆర్ – మెరిడియన్ విద్యాసంస్థలు 50వేలు విరాళం..

కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా సిద్దిపేట లోని ప్రముఖ విద్యాసంస్థలు బి ఎం ఆర్ – మెరిడియన్ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి 50వేలు రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు సిద్దిపేటలో మంత్రి నివాసంలో విద్యాసంస్థల ప్రతినిధులు దేవేందర్ రెడ్డి , రాజా వెంకట్ రెడ్డి గార్లు మంత్రి గారికి చెక్ ని అందజేశారు..

– 60 వేల రూపాయలు విరాళం అందజేసిన సిద్దిపేట ఎంపీపీ..

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న కృషికి మా వంతుగా అని సిద్దిపేట రూరల్ మండలం ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు లు 60వేలు రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి గార్కి చెక్ ని ఇచ్చారు , అదేవిధంగా సిద్ధిపేట ప్రముఖ కాంట్రాక్టర్ అమరెందర్ రెడ్డి శ్రీనిధి కన్ స్ట్రక్షన్ తరుపున 25 వేలు విరాళం ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గార్కి చెక్ ని అందజేశారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat