అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్‌ను భారత్ తమకు పంపని పక్షంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి.
ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో కరోనా వైరస్ పెరిగిపోతున్న సమయంలో… ప్రధాని మోదీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన ట్రంప్, ఆ ప్రతిపాదన ఫలించకపోవడంతో… ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా సమాచారం.
కరోనా తగ్గిన తర్వాత ట్రంప్… భారత్‌పై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.