శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
హ్యాపీ బర్త్‌డే చిచ్చా అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. మీ చిరునవ్వు, సరళత, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న దయ తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో పోరాడుతున్న పేదవారికి మీ సహకారం ప్రశంసనీయమైనది అని సంతోష్ కుమార్ అన్నారు. మాస్ లీడర్లలో ఒకరైన మీరు తనకు ఇష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో, సంతోషంగా, శాంతియుతంగా మరింత కాలం చిచ్చా ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు