తన అందాలతో చక్కని అభినయంతో కుర్రకారును మతి పోగొట్టింది బక్క పలచని హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ .కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఎలా టైం ను స్పెండ్ చేయాలో జిమ్ చేస్తూ వీడియోని విడుదల చేసింది ఈ హాట్ భామ.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తనకు మత్తెక్కించే అందమే కాదు గొప్ప మనస్సు కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది .లాక్ డౌన్ కారణంగా అన్నంలేక బాధపడుతున్న తన ఇంటి దగ్గర రెండు వందల కుటుంబాలకు అన్నం పెడుతుంది .
ఇది అంతా ఒక్కరోజే కాదు అంట ఏకంగా లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ రెండు వందల కుటుంబాలకు అన్నం పెడతానని అమ్మడు చెప్పుకువచ్చింది .