ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు ఆర్ధమవుతుంది.ఎందుకంటే ఇప్పటికే రైలు,విమాన టికెట్ల బుకింగ్ ను ఈ నెల పదిహేను తారీఖు నుండి ప్రారంభం కానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెనూ ఖండూ లాక్ డౌన్ ఏప్రిల్ పదిహేనున ముగుస్తుంది.లాక్ డౌన్ ఎత్తివేయడం అంటే స్వేచ్చగా వీధుల్లో తిరగమని కాదు అని ట్వీట్ చేశాడు .కాసేపు తర్వాత ఈ ట్వీట్ ను సీఎం పెనూ ఖండూ డిలిట్ చేశారు.ఈ పరిణామాలను ప్రకారం ఏప్రిల్ పదిహేను తారీఖున లాక్ డౌన్ ఎత్తివేయనున్నరని విశ్లేషకులు చెబుతున్నారు.