టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే.
అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని కల్సి అందజేశారు..ఈ సందర్భంగా సీఎం జగన్ మీరిచ్చిన ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి వినియోగిస్తాము.
మీరు అందించిన ఈ సాయం ఎంతో మంది బాధితులకు ఊరటను కల్గిస్తుంది.మీరు చేసిన సాయానికి ప్రత్యేక కృజ్ఞతలు అని జగన్ ప్రభాస్ తో అన్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ప్రభాస్ రూ.50లక్షలు విరాళం ప్రకటించారు.పీఎం రీలీఫ్ పంఢ్ కు రూ.3కోట్లను ప్రకటించాడు.