ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది.
అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఎవరైనా ఓ వ్యక్తి కరోనా సోకిన వ్యక్తితో తిరిగి ఉంటే తనకు ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందేమో ఆరోగ్య సేతు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్ సహా 11 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తొలుత వారి మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వినియోగదారులు ఉన్న ప్రదేశం ఆధారంగా వారు సురక్షితమైన ప్రదేశంలో ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తుంది