తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులను తగ్గించిన కానీ ఢిల్లీ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి రూ .370కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పాలనాపరమైన అనునతులు ఇస్తూ ఆదేశాలను సైతం జారీ చేసింది.
వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.ఆయా శాఖల కార్యదర్శుల ఖాతాల్లో సీఎస్ జమా చేయనున్నారు.విపత్తు కాలంలో ఖర్చు చేయని మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని ఆర్థిక శాఖ ప్రకటనను విడుదల చేసింది.