ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్పొరేటర్లు ప్రతి రోజు రెండు గంటల పాటు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.