మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కరోనా వైరస్ నివారణకు సంబంధిచి జిల్లా కలెక్టర్ హన్మంత రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. ఢిల్లీ ప్రార్థనల్లో సంగారెడ్డి జిల్లా నుండి వెళ్లిన 21మందిలో ఫైజాబాద్ నుంచి వచ్చిన వారిని 10 మందిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సమాచారం ఆధారంగా క్వారంటైన్‌లో ఉన్న వీరిని పరీక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంఎన్ఆర్ హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచి, వీరి రిపోర్టులు వచ్చిన తరువాత తగు చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు గారికి తెలిపారు.