తెలంగాణలో లాక్‌డౌన్ సమయంలో డయల్ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో 6.4లక్షల కాల్స్ వచ్చాయని చెప్పారు.
సామాజిక దూరం పాటించడంలేదని ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.లాక్‌డౌన్‌లో జనం గుంపులు గుంపులుగా ఉన్నారని, రవాణా సమస్యలు, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు నిత్యావసరల ధరలు ఎక్కువగా ఉన్నాయని అధిక సంఖ్యలో కాల్స్ వచ్చాయని పోలీసులు తెలిపారు.
‘పలువురు కరోనా అనుమానితుల సమాచారం కూడా ఇస్తున్నారు. మనందరి రక్షణ కోసం ఇంటికి పరిమితమవడమే మన ముందున్న ప్రత్యామ్నాయం. నివారణ లేని కరోనాను నియంత్రించడ మొక్కటే పరిష్కారం.
పోలీసుల ఒక్కరి వల్లే ఇది సాధ్యం కాదు..దానికి మీరందరి సహకారం కావాలి. సామాజిక దూరం పాటించండి..పోలీసులకు సహకరించండి.’ అని డీజీపీ విజ్ఞప్తి చేశారు.