కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 199దేశాలను వణికిస్తుంది.
యూరప్ దేశాలను సైతం అతలాకుతలం చేస్తుంది.అయితే యూరప్ కు చెందిన ఒక దేశం మాత్రం ఉలుకు లేదు.పలుకు లేదు.యూరప్ కు చెందిన బెలారస్ దేశం మాత్రం కరోనా వైరస్ ను చాలా తేలిగ్గా తీసుకుంటుంది.ఎలాంటి లాక్ డౌన్ లు లేకపోయిన కానీ స్వయంగా ఆ దేశ ప్రజలకు లూకా షెంకో భరోసానిస్తున్నారు.
కరోనా వైరస్ ను చూసి ప్రజలు ఎవరూ భయపడవద్దు.అందరూ ధైర్యంగా ఉండండి.శరీరం నిత్యం పని చేసి..బలమిచ్చే ఆహారాన్ని తీసుకుంటె ఎలాంటి వైరస్ సోకదని ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.మరోవైపు బెలారస్ దేశంలో 94కేసులు నమోదయ్యాయి.ఒక్కరు కూడా మృత్యువాత పడలేదు అని ఆయన ప్రకటించారు.