Home / SLIDER / సిరిసిల్ల కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం 

సిరిసిల్ల కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు వేగవంతం 

జిల్లాలో కోవిడ్ వ్యాధి వ్యాప్తి ప్రబలకుండా చూడాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు సూచించారు

మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె.తారకరామారావు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, జిల్లా వైద్యాధికారి శ్రీ చంద్రశేఖర్ తో మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ ను సమర్థవంతంగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి , జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేసారు.

జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న 1032 మందిని ఏప్రిల్ 7వ తేదీ దాకా బయటకు రాకుండా చూడాలని , క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి పాస్ పోర్ట్ లు రద్దు చేయాలని ఆదేశించారు. దక్షిణ కొరియా దేశం లో కేవలం ఒక వ్యక్తి ద్వారా ఆ దేశంలోని 59 వేల మందికి కరోనా వ్యాధి సోకిందని, నిర్లక్ష్యంగా ఉంటే మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర గ్రామాల నుంచి తమ గ్రామంకు వచ్చే వ్యక్తులను కూడా గ్రామ ప్రజలు స్వీయ గృహ నిర్భంధం లో ఉంచేలా చూడాలని కోరారు.

ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా జిల్లాలోని ఇటుక బట్టీలు, నిర్మాణరంగం ,ఇరిగేషన్ ప్రాజెక్టుల లో పని చేస్తున్న వలస కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని కలెక్టర్ ను ఆదేశించారు. వారికి షెల్టర్ సౌకర్యం కల్పించాలని, ఆనారోగ్యంగా ఉన్న కార్మికులకు అవసరమైన మందులను, వైద్య సేవలను ఉచితంగా అందించాలని జిల్లా వైధ్యాదికారిని ఆదేశించారు. అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా ఉచితంగా కల్పిస్తున్న భోజన సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నిరుపేద ప్రజలు అన్నపూర్ణ క్యాంటీన్ ల ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

జిల్లాలోని అన్ని గ్రామాలలో క్రిమి సంహారక సోడియం హైపో క్లోరేట్ లిక్విడ్ ను తప్పనిసరిగా పిచికారి చేసేలా చూడాలి అన్నారు. పట్టణాలు గ్రామాలలో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు.

అలాగే జిల్లాలో నిత్యావసర వస్తువుల సరఫరా సాఫీగా జరిగేలా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

జిల్లాలో రైతులు తమ పొలాలలో పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వ్యవసాయ మార్కెట్ యార్డులలోకి రైతులు ధాన్యం తీసుకురాకూడదన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి దశల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొత్తం 13 మండలాలలో 1,32,992 ఎకరాలలో రబీ 2019-20 కాలానికి వరి పంటని పండించడం జరిగిందని, ఈ సీజన్ లో మొత్తం 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ప్రస్తుత రబీ 2019-2020 కాలానికి , IKP-85, PACS-125, MEPMA-2, DCMS-3, మొత్తం 215 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.

జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs), గ్రామ రెవిన్యూ అధికారులు(VROs), మండల వ్యవసాయ అధికారులు (MAOs), మండల తహసిల్దార్లు (MROs),గ్రామ, మండల, రైతు బంధు సభ్యులు, కోఆర్డినేటర్లు అందరూ సమన్వయముతో ఆయా గ్రామాలలోని రైతులకు టోకెన్లు జారీ చేసి, దాని ప్రకారం రైతులు వరి ధాన్యం కోసి, సెంటర్లకు తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి పేర్కొన్నారు. . ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న 141 హర్వేస్టర్లు( వరి కోత యంత్రాలు ) యంత్రాలతో పాటు మరిన్ని హర్వేస్టర్లను ( వరి కోత యంత్రాలను ) ఇతర జిల్లాల లేదా ఇతర ప్రదేశాల నుండి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేయాలని అన్నారు. రైతులందరూ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వారిని చైతన్యము చేయాలన్నారు రైసు మిల్లర్ యజమానులు , మధ్యవర్తులు కూడా వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి రైతుల దగ్గర కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి వసతులు కల్పించడంతో పాటు, సానిటేషన్ చేయించాలని, కొనుగోలు కేంద్రాలలో, అందరూ సామాజిక దూరం పాటించాలని, ఎట్టి పరిస్థితులలో సంబంధిత రైతులు , హమాలీలు, ట్రాన్స్ పోర్ట్ వ్యక్తులు , కొనుగోలు కేంద్రాలలో పని చేసే సిబ్బంది మినహా ఇతరులను కొనుగోలు కేంద్రాలలోకి అనుమతించకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రం నుండి రైసు మిల్లులకు ధాన్యం రవాణాకు అదనపు లారీలు సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు.

క్వారంటైన్ లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగిన వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. వలస కార్మికులకు వారి యజమానులు మౌలిక వసతులు కల్పించేలా చూడాలని అన్నారు. నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెటింగ్, నిల్వచేసిన,ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా చూడాలని అని ఆయన కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat