ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.అయితే వీరిద్దరి నమునాలను పరిశీలించగా పాజిటీవ్ అని తేలింది.గతవారం పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు.
ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక సిబ్బంది కూడా ఐసోలేషన్‌కు వెళ్లినట్టు స్థానిక మీడియా జెరూసలెం పోస్టు తెలిపింది.
ఇప్పటికే దేశ ఆర్థిక మంత్రి, కెనడా ప్రధాని భార్య ఈ వైరస్ బారినపడ్డారు. స్పెయిన్ యువరాణి మృత్యవాతపడింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌లో 4347 మందికి కొవిడ్-19 వైరస్ సోకగా వీరిలో 15 మరణించారు. 132 మంది కోలుకున్నారు.