కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన లవ్ అగర్వాల్ సోమవారం దీని గురించి ప్రస్తావిస్తూ.. తాము ఇప్పుడు దీన్ని కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ గా వ్యవహరించడం లేదని, మన దేశం ఇంకా లోకల్ ట్రాన్స్ మిషన్ దశలోనే ఉందని వెల్లడించారు.
‘మేం కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ అని వ్యవహరించి ఉంటే అప్పడు వివిధ రకాల ఊహాగానాలకు తావిఛ్చి ఉండేవారం’ అన్నారాయన. లోకల్ వేరు, కమ్యూనిటీ వేరు అని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.