Home / LIFE STYLE / కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం)

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం)

కరోనా మెడిసిన్ – TCM (ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనా ఆయుర్వేదం) అని జగన్ అనే ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అసలు దాని సంగతేంటో..అది ఎలా ఉంటుందో..దాని ప్రభావం ఏంటనే పలు విషయలను తెలుసుకుందామా

చైనా లో మానవ నాగరికత మొదలైనప్పటినుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్ చైనా లో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

ప్రస్తుతం వ్యాప్తి లో ఉన్న కరోనా వైరల్ డిసీజ్ ని అరికట్టటం లో కూడా TCM చాలా ప్రాముఖ్యత వహించింది అని చైనా నుంచి ఇంగ్లీష్ లో విడుదల అయ్యే చైనా డైలీ పత్రిక ప్రముఖం గా ప్రచురించింది. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రడిషనల్ మెడిసిన్ ప్రకారం 60,107 మంది కరోనా పేషంట్స్ (85.25%) ని TCM డాక్టర్స్ ట్రీట్ చేశారు. చైనా లో 2 రకాలైన డాక్టర్స్ ఉంటారు, అల్లోపతి, TCM డాక్టర్స్. ఆల్లోపతి వాళ్ళు కూడా కొంతభాగం TCM గురించి తెలుసుకోవాలి.

ఒక్క చైనా లోనే కాదు, సింగపూర్, మలేషియా, దక్షిణ్ కొరియా, వియత్నాం, కొన్ని యూరప్ దేశాల్లో కూడా TCM ని వాడతారు. అమెరికా లోని FDA (Food and Drug Administration) కూడా దీని ప్రాముఖ్యత ని గుర్తించి సప్లిమెంట్స్ అనే ఒక విభాగాన్ని చేర్చి దాని ప్రాముఖ్యత ని గుర్తించింది. NIH (నేషనల్ ఇన్సి స్ట్యూట్ ఆఫ్ హెల్థ్) ఏకం గా NCAM (నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్ నేటివ్ మెడిసిన్) అనే సంస్థని నెలకొల్పింది.

ఇంకా TCM విషయానికొస్తే ఈ మందు లో 10% యానిమల్ ప్రొడక్ట్స్ 90% హెర్బ్స్ ఉంటై. కరోనా ట్రీట్ మెంట్ కి ద్రవ రూపం లో దీన్ని ఇస్తారు. అయితే ఇది కరోనా వైరస్ ని చంపదు, కరోనా వైరస్ క్రియేట్ చేసిన ట్రాష్ ని క్లీన్ చేస్తుంది. తద్వారా మన శరీరం లోని యాంటీబాడీస్ వైరస్ పై పోరు జరిపి వ్యాధి ఎక్కువ అవకుండా చేస్తుంది, లేదా క్యూర్ చేస్తుంది. వ్యాధి మైల్డ్ గా లేదా మోడరేట్ గా ఉన్నప్పుడే డాక్టర్స్ కూడా TCM ని ఉపయోగించి ట్రీట్ చేశారు. వ్యాధి సివియర్ గా ఉన్నప్పుడు మాత్రం వెస్ట్రన్ మెడిసిన్స్ నే ఉపయోగించారు. అల్లోపతి, ఆయుర్వేదం అక్కడ కలిపి ఉపయోగించారు అందుకే 80 వేల మందికి వచ్చినా 3 వేల మరణాలతోనే వ్యాధిని అదుపులోకి తేగలిగారు. ప్రధానం గా గుర్తు పెట్టుకోవాల్సింది సప్లిమెంట్ గా ఉపయోగించారు.

నా ధ్రుష్టిలో ఆయుర్వేదం అంటే అమ్మ, అల్లోపతి అంటే భార్య. ఇద్ధరూ ఉండి సఖ్యత గా ఉంటే ఎంత సంతోషం గా ఉంటుంది. అదే ఇక్కడా చైనా లో జరిగింది. చైనా లో అల్లోపతి డాక్టర్స్ కూడా 20% TCM ని వాడమని చెప్తారు. TCM డాక్టర్స్ కూడా ప్రతి దానికి ఆయుర్వేదం లో మందు ఉంది అని చెప్పరు. వాళ్ళ పురాతన ఆయుర్వేద పుస్తకాలని ఇంగ్లీష్ లోకి మార్చి విస్త్రుతమైన అధ్యయనం కూడా చేస్తున్నారు. అల్లోపతి వలన నయం కాని ఎన్నో జబ్బులని నయం చేస్తున్నారు. ఈ మధ్య అమెరికా, యూరప్ డాక్టర్స్ కూడా TCM పై అవగాహన పెంచు కుంటున్నారు.

మన దగ్గర ఎక్కువ మంది ఆయుర్వేద వైధ్యులు ప్రతిదానికీ మందు ఉంది అని చెప్పి ఏవేవో కల్లబొల్లి కబుర్లు చెప్తారు. ఒకరు పొద్దున్నే 5 లీటర్ల నీళ్ళు తాగమంటారు, ఇంకొకరు లీటర్ తాగమంటాడు. ఇంకోడు వేడి నీళ్ళు అంటాడు, మరొకడు గోరు వెచ్చని అంటాడు,ఇంకొకడు చల్లని నీళ్ళు అంటాడు. ఒక్క నీళ్ళ విషయం లోనే ఇన్ని బేధాలు ఉంటే మిగతా విషయాల్లో ఉన్న వైరుధ్యాలు మనకి తెలియనివి కావు.

అల్లోపతి గాళ్ళలో కూడా చాలా మంది అతి గాళ్ళే. ఏ కాలం లోనైనా, ఏ రోగం వచ్చినా ఏమైనా తినొచ్చు అంటారు. అల్లం, వెల్లుల్లి వేస్ట్ అన్నట్లు మాట్లాడతారు. సాధారణ తలనొప్పి, PCOD, మోకాళ్ళ నొప్పి తగ్గించలేని వెధవలు (*Conditions Apply; ఆయుర్వేదం గురించి నెగటివ్ గా మాట్లాడే అల్లోపతి వాళ్ళు) కూడా ఆయుర్వేదం గురించి పూర్తి నెగటివ్ గా మాట్లాడటం ఆశ్చ్యర్యం కలిగిస్తుంది.

అల్లోపతి లో కొందరు మంచి డాక్టర్స్ ఉన్నారు. ఏ కాలం లో దొరికింది ఆ కాలం లో తినాలి అంటారు, తగిన వ్యాయామం, విశ్రాంతి ఉండాలి అంటారు. మన ఆచారాల్లోని మంచి ని ఫాలో అవుతూ కావాల్సిన వాటికి ఇంగ్లీష్ మందులు వాడమంటారు. ఆయుర్వేదం లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు.

ఏది ఏమైనా ప్రాఛీన ట్రడిషనల్ మెడిసిన్ మీద విస్త్రుత అధ్యయనం జరిపి వాటితో పాటు అల్లోపతి కాంబినేషన్ గా సమన్వయం తో ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటై అని నా అభిప్రాయం.

– జగన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat