ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.కరోనా బాధితులకు అండగా ఉండటానికి పలువురు ప్రముఖులు ముందుకోస్తున్నారు.సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు తమ సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటిస్తున్నారు.
సామాజిక మాధ్యమాన్ని ఏలుతున్న ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ ఏకంగా రూ.187కోట్లను విరాళంగా ప్రకటించారు.
కోవైడ్ 19చికిత్సకు సంబంధించిన పరిశోధనలకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ క్రమంలో బిల్ అండ్ మిలందా గేట్స్ ఫౌండేషన్ తో కల్సి పని చేస్తామని జూకర్ బర్గ్ తెలిపారు.అయితే ఇప్పటికే బిల్ అండ్ మిలందా గేట్స్ ఫౌండేషన్ 125 మిలియన్ డాలర్లతో ఒక కార్యాచరణను మొదలెట్టింది