మొదట అది మన చేతి దగ్గరికి వచ్చినప్పుడు మనం సోప్ వాటర్ తో శుభ్రం గా కడుక్కుంటే మన చేతులతో దాన్ని చంపొచ్చు. సోప్ ఉపయోగించి వేడి నీళ్ళతో కడుక్కుంటే కరోనా వైరస్ కి పైన ఉండే గ్లైకో ప్రోటీన్ స్పైక్స్ రాలి పోతాయి. ఫోటో లో ఆకుపచ్చ రంగులో ఉన్న స్పైక్స్ ని చూడొచ్చు. ప్రోటీన్ స్పైక్స్ పోతే అది మన నోట్లోకి వచ్చినా ఏమీ కాదు. సానిటైజర్స్ మాత్రం నీళ్ళు, సోప్ అందుబాటులో లేనప్పుడు మాత్రమే వాడాలి, వాడినా 70% కంటే ఎక్కువ ఆల్క హాల్ ఉన్న సానిటైజర్స్ మాత్రమే వైరస్ ని చంపగలవు.
చేతి ద్వారా కాకుండా డైరక్ట్ గా తుంపర్ల ద్వారా ముక్కు/నోటి ద్వారా మనకి వచ్చినా అవి డైరక్ట్ గా ఆహార నాళం లోకి వెళితే అక్కడ యాసిడ్స్ రిలీజ్ అయ్యి వైరస్ ని చంపుతాయి. అలా కాకుండా తప్పించుకొని గొంతు దగ్గరే ఆగి అవి రెస్ట్ తీసు కుంటుంటే మనం వేడి వాటర్ తాగినా, అల్లం వాటర్ తాగినా వాటితో పాటు వైరస్ లోపలికి వెళ్ళి జీర్ణాశయం లో వాటిని చంపి పడేయొచ్చు.
ఇక్కడ మిస్ అయి అవి తప్పించుకొని ఊపిరితిత్తుల దగ్గరికి వెళితే… వైరస్ లు సొంతం గా బతకలేవు, వాటికి అతిధి సెల్స్ కావాలి. అతిధి సెల్స్ ని హైజాక్ చేసి వాటిని ఉపయోగించుకొని తమ సెల్స్ ని డివిజన్ చేసుకొని తమ సంఖ్య పెంచుకుంటాయి. ఈ కరోనా వైరస్ కి పైన ఉండే స్పైక్స్ అతుక్కోటానికి ఊపిరితిత్తుల కింద ఉన్న మన ACE రిసెప్టర్స్ సహాయం చేస్తాయి. ఎప్పుడైతే కరోనా వైరస్ మన శరీరం లోపలికి వచ్చాయి అని మన శరీరం లో ఉన్న పోలీస్ యాంటీ బాడీస్ (IgA, IgD, IgE, IgG, IgM) కి తెలిస్తే ఈ వైరస్ ACE రిసెప్టర్స్ కి అతుక్కొని చేసే హైజాక్ కుమ్మక్కు ని ఆపుతాయి, మన యాంటీబాడీస్ నే వెళ్ళి తమ బైండింగ్ సైట్స్ ద్వారా వైరస్ కి అతుక్కొని వాటిని చంపుతాయి.
ఒకవేళ మన శరీరం లోని యాంటీ బాడీస్ లు సక్రమం గా పని చేయకపోయినా, వెంటనే స్పందించక పోయినా T సెల్స్ రియాక్ట్ అయ్యి వైరస్ ని చంపుతాయి ఈ సెల్స్ మన ఆర్మీ లెక్క పని చేస్తుంది. ఒక వేళ వైరస్ T సెల్స్ నుంచి తప్పించుకున్నా మన శరీరం లో రిలీజ్ అయ్యే నేచురల్ కిల్లర్ సెల్స్ వైరస్ ని చంపుతాయి. ఇవి నేవీ ఫోర్స్ లా పనిచేస్తాయి.
అక్కడ కూడా వైరస్ తప్పించుకున్నా మన శరీరం లో ఇంటర్ ఫెరాన్స్ రిలీజ్ అయ్యి వైరస్ ని చంపి పడేస్తాయి.
ఈ విధం గా వైరస్ ని ప్రతి దగ్గరా మనం, మన శరీరం లోని సెల్స్ కాపు కాసి నరికి నరికి చంపుతాయి. ఒక దేశ సైనిక శక్తి కంటే ఎక్కువ రక్షణ కణాలు, సెల్స్ మన శరీరం లో ఉంటై. అనునిత్యం మనం ఎన్నో వైరస్, బ్యాక్టీరియా బారీన తెలియకుండానే పడుతూ ఉంటాం మరియూ మనకి చెప్పకుండానే మన రక్షణ సైన్యం మనల్ని కాపాడుతుంది.
సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే భయం, ఆందోళన ఆవహిస్తుందో మన శరీరం లోపల పోలీసు సెల్స్, ఆర్మీ సెల్స్, నేవీ సెల్స్ తక్కువ రిలీజ్ అయ్యి మనకి వైరస్ ని నిరోధించే శక్తి తక్కువ అవుతుంది. అందుకే దైర్యం గా, నార్మల్ గా ఉంటే వైరస్ ఎటాక్ చేసినా దాన్ని ఎక్కడికక్కడ చంపి పడేయవచ్చు. ఒకచోట మిస్ అయినా ఇంకోచోట వేసి పడేయొచ్చు.
మంచి పౌషికాహారం, ఫ్రూట్స్, ఆకు కూరలు, కాయకూరలు తీసుకొని మనస్సు ప్రశాంతం గా ఉంచుకొని వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకొని శరీరాన్ని కాపాడుకోవటం అత్యుత్తమం.
# Awareness YES, Panic No
– జగన్