ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ పార్టీ, దాని కిరాయి మేధావులకు కంటగింపుగా మారింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం జీర్ణించుకోలేక పోతున్నారు. మరో వైపు హైదరాబాద్ లో ఉంటున్న వారిని ఉసిగొల్పే కుట్రలకు తెరలేపారు”అని అన్నారు . మరొక ట్వీట్ లో “దూరదృష్టి, ప్రజల పట్ల బాధ్యత, ఎటువంటి పరిస్థితులనైనా అదుపు చేయగల నాయకుడే ఇవ్వాల్టి అవసరం. దేశమంతా భీతిల్లుతున్నా సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేసి కరోనా మహమ్మారిపై యుద్ధం ప్రకటించడం అసాధారణం. దేశమంతా ఆయన మార్గాన్ని అనుసరిస్తుంది” అని అన్నారు .
