తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చికెన్,గుడ్డు తినకూడదు.వాటి వలన కరోనా వైరస్ వస్తుందని కొన్ని వదంతులు సృష్టించారు.వీటిపై ప్రజల్లో అపోహాలను నింపారు.
అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు.శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండిచికెన్ తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. వ్యాధిని అడ్డుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తిని, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలన్నారు. సీ విటమిన్ ఉండే నిమ్మకాయలు, సంత్రాలు, బత్తాయి పండ్లు, దానిమ్మపండ్లను ఎక్కువగా తినాలని సూచించారు. నల్లగొండ, ఇతర జిల్లాల్లో బత్తాయి పండ్లు పండుతాయని, వాటిని వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేయొద్దని, మన రాష్ట్ర అవసరాలకే వినియోగించుకోవాలని చెప్పారు.
అన్ని కాలనీల్లో, రైతు బజార్లలో ప్రత్యేక అనుమతులిచ్చి విక్రయించాలి. ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మామిడి పండ్లు కూడా ఎక్కువగా తినాలని, పండ్లను జిల్లా, తాలుకా కేంద్రాలకు, పట్టణాలకు పంపించాలని ఆయన సూచించారు.