ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది.
అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది.అన్ని రకాల క్రెడిట్ కార్డు బిల్లులు కట్టనవసరంలేదు అని తేల్చి చెప్పింది.మూడు నెలల వరకు అన్ని రకాల క్రెడిట్ కార్డుల ఈఎంఐల పై కూడా మారటోరియాన్ని విధిస్తున్నట్లు తేల్చి చెప్పింది.