తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులను మరోసారి సున్నితంగా హెచ్చరించారు.ఇటీవల ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండాలి.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధేశ్యాన్ని ఆర్ధం చేస్కోకుండా సాక్షాత్తు ప్రజాప్రతినిధులే గుంపులు గుంపులుగా గుమిగూడిన సంఘటనలు వార్తల్లో వచ్చాయి.
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ “ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర ఉంటున్నారని కోపానికి వస్తే బయలుదేరి వందలు వందలు పోతున్నారు. కుప్పలు కుప్పలుగా పోయి ప్రజలకు కొత్త సమస్యలు తేవొద్దని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు.
ఒక్కరుగా పోవాలని, కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా పర్యవేక్షించాలి. ప్రజలకు అండదండగా ఉండాలని ఆయన సూచించారు.