మాజీ సీఎం చంద్రబాబు కరోనాకు సంబంధించి తన ప్రవర్తనతో రాష్ట్ర ప్రజలను టార్చర్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాను ఒక్కడే 10,15 టీవీలను ముందేసుకుని అన్నీ తానే కంటోల్ చేస్తున్నట్టు, అందరికీ తానే ఆదేశాలిస్తున్నట్టుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. అలాగే తానే సీఎంలా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి జనానికి సుద్దులు చెప్తున్నారు. కరోనాకు మందు కనిపెడుతున్న వైద్య నిపుణుల బృందానికి లీడర్ లా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు మాత్రం ‘మీరు లేని విలువ ఇప్పుడు తెలుస్తుంది సార్.. మీరుంటే మీరు తీసుకునే చర్యల వైపు ప్రపంచం చూసేది..
మీలా ధైర్యం చెప్పేవాళ్ళు ఓడిపోవడం మా దురదృష్టం.. ఏపీలో అందరికీ కరోనా వచ్చి చచ్చిపోవాలని శాపాలు పెడుతున్నారు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రులు 4,5 రోజులకు ఒకసారి మీడియా ముందుకోస్తుంటే.. జనానికి మాత్రం చంద్రబాబు రోజూ టార్చర్ చూపిస్తున్నాడు. పోనీ ఈయనేమైనా అతిముఖ్యమైన సలహాలిస్తున్నాడా అంటే అదీ లేదు.. నిత్యం సోషల్ మీడియాలో, టీవీ పేపర్లలో ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలనే మళ్లీ చెప్తున్నాడు. స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వం, పోలీసులకు ప్రజలు సహకరించాలని, బయటి నుండి వచ్చిన వాళ్ళు క్వరంటయిన్ లో ఉండి ఉంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్తున్నారు. అలాగే క్ డౌన్ కు మించి నిర్ణయం మరొకటి లేదని, కేంద్రం విధించిన మూడు వారాల లాక్ డౌన్ అనేది సరైన నిర్ణయమని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి తన సలహాలు సూచనలు తీసుకోవాలి కోరుతున్నారు. ఇది అత్యంత దారుణం.