వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది.దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారు ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకె ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు” అని అన్నారు..
