ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము.
లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాళ్ల ఈఎంఐలు ఆరు నెలల పాటు రద్ధు చేయాలి.
ఈ ఆరు నెలల పాటు ఎలాంటి వడ్డీలు లేకుండా చూడాలి.కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు,వైద్య సిబ్బందికి N-95మాస్కులను అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.