కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇండియా కూడా మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే తాజాగా ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదనే చెప్పాలి. ఇక ఏపీలో అయితే అతి తక్కువ కేసులు ఉన్నాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సిఎం జగన్ గారు తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ వలంటీర్లకు పని విభజన చేసి ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును తయారు చేయడం అత్యంత క్లిష్టమైన కార్యక్రమం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి” అని అన్నారు.
