ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మార్చి 31 వరకే లాక్ డౌన్ విధించాం కానీ దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ లాక్ డౌన్ లో పోలీసులు కొట్టినా ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు కాబట్టి. ఇప్పుడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగడంతో వారు తాట తీసే పనిలో ఉంటారని అందరికి అర్ధమవుతుంది.
