సంక్షోభాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు కరోనా సంక్షోభం లో కూడా చంద్రబాబు అదే పనికి చేస్తున్నారు. ఈ మధ్య ప్రధాని మోడీకి మళ్ళీ దగ్గర అయ్యేందుకు నానా పాట్లు పడుతున్న చంద్రబాబు కి కరోనా కలిసి వచ్చింది. ఇంకేం పొద్దున్న లేస్తే మోడీ భజన చేస్తున్నారు మన బాబుగారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు భేష్ అని తెగ పొగిడేస్తున్నారు. అయితే విశాఖ కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం మోడీ పై నిప్పులు చెరుగుతున్నారు. కరోనా వైరస్ పట్ల మొదట్లో మోడీ అలసత్వం ప్రదర్శించారని వాసుపల్లి విమర్శించారు. జనవరి లోనే విదేశాలనుండి వచ్చే విమానాలను నిలిపి వేసి ఉంటే బాగుండేది అని, ఆలా కాకుండా విదేశాలనుండి వచ్చిన వేలాదిమందిని 100 కోట్ల ప్రజలలో కలిపి వేసి ఇప్పుడు దేశం మొత్తం లాక్ డౌన్ చేసి దేశ ప్రజలను ప్రాణాపాయ స్థితిలో కి నెట్టారని, ఇది ముమ్మాటికీ ప్రధాని మోడీ వైఫల్యం అని వాసుపల్లి గణేష్ కుమార్ విరుచుకుపడ్డారు. ఒక పక్క కరోనా పేరుతో మోడీ కి భజన చేసి మళ్ళీ బీజేపీ తో కలిసేందుకు నానా తంటాలు పడుతున్న చంద్రబాబు కి సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.
