ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు.
అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి ఆటలు ఆడుతున్నారు.అటు ఆడవాళ్లు ఇంటి చుట్టూ ఉన్న పక్కవారిని పిలిచి భోజనాలు..కిట్టీపార్టీలాంటివి చేసుకుంటున్నారు.
లాక్ డౌన్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే తమ కుటుంబంతో తప్పా వేరేవాళ్లతో కాంటాక్టవ్వద్దు అని.మరి దీన్ని మనం క్రాస్ చేయద్దు కదా..అందుకే మన ఇంట్లో మనం ఉందాం..కరోనాను తరిమికొడదాం..