కరోనా మహమ్మారి భారత్ లో అడుగుపెట్టినప్పటినుండి ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా పోయింది. దాంతో మోదీ దేశం మొత్తం లాక్ డౌన్ చెయ్యాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో కాస్త కట్టడి అయ్యిందే చెప్పాలి. ప్రస్తుతం దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కుదురుగా ఉన్నాయని చెప్పాలి. అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ కొంచెం పర్వాలేదని చెప్పాలి. దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ “ఐసోలేషన్, క్వారెంటైన్ ల కోసం ఏర్పాటు చేసే తాత్కాలిక ఆసుపత్రుల నుంచి చుట్టుపక్కల ఇళ్లలోని వారికి ఎలాంటి అపాయం ఉండదు. అవి అనుమానితుల పరిశీలన కోసం ఏర్పాటు చేసినవి. రోగితో సన్నిహితంగా ఉంటే తప్ప దూరంగా ఉన్నవారికి గాలి ద్వారా కరోనా వ్యాపించదు. అపోహలు పెంచుకుని ఆటంకాలు సృష్టించొద్దు” అని అన్నారు.
