- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుధ్య కార్మికులు, మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం. మీడియా సహకారానికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లు కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అనుకుల పత్రికలైన రెండు పచ్చ పత్రికలు కరోనా ఎఫెక్ట్ తో గతంలో ఎన్నడూ లేనంత గడ్డు కాలాన్ని ఎదురుక్కుంటున్నాయి. కరోనా వైరస్ భయం తో ప్రజలు పేపర్లు చదవడం బంద్ చేశారు. ఆఖరికి పొద్దున్నే కాఫీ కప్పు పట్టుకుని పచ్చ పత్రికలు చదివే చంద్రబాబు కులాభిమానులు కూడా పేపర్ పట్టుకోవాలి అంటేనే గజగజలాడుతున్నారు. ఇప్పటి వరకు నెల నెల ఇంటికి పేపర్ వేయించుకునే వాళ్ళు కూడా కరోనా భయం తో ఇక మాకు పేపర్ వేయద్దు అని చెబుతున్నారు. ఇక అపార్టుమెంట్ వాళ్ళు అయితే నో పేపర్ అని బోర్డులు పెడుతున్నారు. దీంతో నిన్నటి వరకు లక్షలాదిగా సర్క్యూలేషన్ తో అలరారిన ఆ రెండు పచ్చ పత్రికల సర్క్యూలేషన్ అమాంతం పడిపోయింది . ఇక తమ కుల ప్రభువు చంద్రబాబు కు కూడా కరోనా దెబ్బతో పని లేకుండా పోయింది. కరోనా విపత్తు నేపథ్యంలో చంద్రబాబు రాజకీయం చేస్తే అంతకంటే సిగ్గుచేటు ఉండదు. మరో వైపు జనతా కర్ఫ్యూ కోసం ఇంటికి వెళ్లిన చంద్రబాబు లాక్ డౌన్ తో హైదరాబాద్ లోనే ఇరుక్కుపోయాడు. దీంతో ప్రభుత్వం పై ప్రెస్ మీట్లు పెట్టె అవకాశం ఎక్కువగా లేకుండా పోయింది. చంద్రబాబు కి పని లేకపోవడంతో పచ్చ పత్రికలకు కూడా పెద్దగా పని లేకపోయింది. అన్ని కరోనా న్యూస్ కావడం తో ప్రజలు ఎప్పటికప్పుడు టీవీ ల ద్వారా తెలుసుకుంటున్నారు. దీంతో మర్నాడు పేపర్లలో వచ్చే న్యూస్ కి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక కరోనా దెబ్బతో చంద్రజ్యోతి పత్రిక ఒక అడుగు ముందుకేసి తమ పేపర్లు ముట్టుకుంటే కరోనా అంటదు.. ఇదిగో పేపర్లను శానిటైజ్ చేశామంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మొత్తానికి కరోనా దెబ్బతో ఇటు రెగ్యులర్ పాఠకులు దూరమై అటు కేవలం చంద్రబాబు కోసం తమ పేపర్లు చదివే కులాభిమానులు దూరమై ఆ రెండు పచ్చ పత్రికలు గిలగిల కొట్టుకుంటున్నాయి.
Tags Aandhrapradesh carona effect Chandrababu politics struggling yelllow papers