కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ఆధార్ కార్డులోని చిరునామాను ప్రామాణికంగా తీసుకుంటూ 3 కిమీ నిబంధన అమలు చేయాలని భావించారు.
అయితే అనేక మంది ఆధార్ కార్డుల్లోని చిరునామాలు అప్‌డేట్ కాకపోవడంతో ఇది సాధ్యం కాలేదు. ఇలా నిర్దేశించిన పరిధిని దాటి తమ వాహనాల్లో సంచరించే వారికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్‌పీఆర్) సిస్టమ్ ద్వారా చెక్ చెప్తున్నారు. ఈ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) ద్వారా ట్రాఫిక్ కెమెరాలకు ఏర్పాటై ఉంది. సిటీలోని 250 జంక్షన్లలోని ట్రాఫిక్ కెమెరాల్లో ఇది అందుబాటులో ఉంది. ఏఎన్‌పీఆర్ సిస్టమ్ పూర్తి సాఫ్ట్‌వేర్ ఆధారితంగా పని చేసే పరిజ్ఞానం. దీన్ని బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు వినియోగించడానికి దీని ప్రోగ్రామింగ్‌లో స్వల్ప మార్పులు చేశార