కరోనా వైరస్ మొదట చైనా దేశం నుండి మొదలైన సంగతి విదితమే.మొదట్లో చైనాలో కరోనా విజృంభించగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.అయితే ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 198దేశాలపై పడింది.తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది.
ఇప్పటివరకు 81,285కరోనా కేసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో ఉంది.తాజాగా అమెరికాలో ఒక్కరోజే 13,785కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81,996గా నమోదయ్యాయి.ఇప్పటివరకు మొదటి ప్లేసులో ఉన్న చైనాను అమెరికా దాటింది.
అమెరికాలో నిన్న ఒక్కరోజే 150మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.మొత్తం మరణాల సంఖ్య 1,177కి చేరుకుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ అమెరికాలో కరోనా నియంత్రణలోకి రావడంలేదు..