తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు.
దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన నియోజకవర్గమైన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో లాఠీ పట్టి హాల్ చల్ చేశారు.రోడ్లపై లాఠీతో తిరుగుతూ అటుగా వచ్చే ప్రజలను ఆపుతూ కారణాలు అడిగారు.సరైన కారణం చెప్పని వార్ని బండి,కార్లల్లో ఎక్కించి వెనక్కి పంపించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికే ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.ఇందుకు అందరూ సహాకరించాలని సూచించారు..