దేశంలో కరోనా వైరస్ ప్రభలుతుంది.కరోనా వైరస్ బారీన పడకుండా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల లాక్ డౌన్ ప్రకటించాయి.ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలను ప్రచారంలో వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.
తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.దేశంలో ఉన్న ఎనబై కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరే విధంగా రేషన్ సరుకులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.ఈ క్రమంలో కేవలం రూ .3లకే బియ్యం,రూ.2లకే గోదుమలు ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు.
నిత్యవసర వస్తువులను అందించే దుఖానాలు నిత్యం తెరిచే ఉంటాయని ఆయన వివరించారు.మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలిస్తామని కూడా తెలిపారు.