సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా నివారణ కోసం పలు జాగ్రత్తలను సూచిస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్ ట్విట్టర్ ద్వారా కొన్ని సూచనలు చేశారు.
మహేశ్ బాబు చెప్పిన 6 సూచనలు:
1. ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లోనే బయట అడుగు పెట్టాలి.
2. రోజులో చాలా సార్లు సబ్బుతో 20-30 సెకన్ల పాటు చేతులను కడుగుకోవాలి.
3. మీ ముఖాన్ని చేతులతో తాకవద్దు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి బాగాలను తాకరాదు.
4. దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ ముఖానికి మో చేతులు లేదా టిష్యూని అడ్డం పెట్టుకోండి
5. సామాజిక దూరం యొక్క అవసరాన్ని గుర్తించండి. ఇంట్లో, బయట ఇతరులతో మూడు మీటర్ల దూరం పాటించండి
- 6. మీకు కరోనా లక్షణాలు ఉంటేనే మాస్కును ఉపయోగించండి. మీకు కోవిడ్ 19 లక్షణాలుంటే డాక్టర్ని సంప్రదించండి