కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది.
ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘ ప్రశంసించింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి శక్తీ సామర్ధ్యాలపై ప్రజలకు వున్నా విశ్వాసాన్నిమేఘ యాజమాన్యం అభినందించింది. 5 కోట్ల రూపాయలకు చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందచేశారు.