కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. నాలుగున్నర లక్షల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్రకటిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. చైనాలోని 3500 మందికి పైగా మృతి చెందగా.. స్పెయిన్, ఇటలీలో దీని ప్రభావం అంతకంతకూ పెరుగుతూ ఉంది. కరోనా కారణంగా ఇటలీలో 7,503 మంది మరణించగా.. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు.