లాక్ డౌన్ కారణంగా ఏపీ విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై పరిస్థితులకు అనుగూణంగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
