కరోనా వైరస్ ప్రభావంతో ప్రజల ప్రాణాలపైనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.కరోనా తో దేశంలో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ఆయా రాష్ట్రాల మధ్య ఎగుమతులు,దిగుమతులు వ్యాపార సంబంధాలు నిలిచిపోయాయి.
ఎక్కడివారు అక్కడే ఉండటంతో వర్తక వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి.మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత్ ఆర్థిక వ్యవస్థకు రూ.9లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని బార్ క్లేస్ సంస్థ ఒక నివేదికను రూపొందించింది.
ఇది దేశ జీడీపీలో నాలుగు శాతం వాటాకి సమానం అని వివరించింది.ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చటానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీ ప్రకటించాలని కూడా వివరించింది.మరోవైపు ఏప్రిల్ మూడో తారీఖున నిర్వహించే సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.