వినడానికి వింతగా..కొంత బాధగా ఉన్న కానీ ఇది నిజం..ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో గజగజలాడుతున్న ప్రపంచానికి మేమున్నామనే భరోసానిస్తూ ఇరవై నాలుగంటలు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు ,ఇతర వైద్య సిబ్బంది.
అయితే వీళ్లు పెద్ద ప్రమాదంలో పడ్డారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు,నర్సులకు,ఇతర వైద్య సిబ్బందికి తమ దగ్గర అద్దెలకు ఇళ్లను ఇవ్వము అని తేల్చి చెప్పిన సంఘటన మనం చూసిన సంగతి విదితమే..
తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వైద్యులకు,ఇతర వైద్య సిబ్బందికి ఈ అనుభవం ఎదురైంది.కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు,వైద్య సిబ్బందిని ఇళ్లను ఖాళీ చేయమని యజమానులు డిమాండ్ చేస్తున్నారు..
దీంతో వైద్యులు,వైద్య సిబ్బంది లబోదిబో అంటున్నారు.తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు ఇలా కష్టం రావడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.మరోవైపు ఇలా చేసేవాళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు..