తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎవరు రోడ్లపైకి రావద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఎవరైన సరే నిబంధనలను ఉల్లంఘించి రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎవరైన రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలను జారీ చేశారు.. ఏమన్నా అత్యవసర పని ఉంటే వంద నెంబరుకు డయల్ చేయాలని సూచించారు..