ఎప్పుడు వచ్చామో కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారు. దేశమంతటా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.. ఎవరిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు.. ప్రతీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికారులు, ప్రభుత్వాధినేతలు తమ శక్తిమేరకు ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పనిచేస్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా కరోనాపై యుద్ధం మాదిరిగా పనిచేస్తున్నారు. దేశంమొత్తం ఈ వైరస్ మహమ్మారి భూభాగం నుండి తొలగి పోవాలని కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలను అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండడంతో కరోనా పేషెంట్లను గుర్తించడం చాలా సులభమైంది. ఎవరెవరు విదేశాలనుండి వచ్చారు వారు ఎవరిని కలిశారు అనే అంశాలపై ఆరా తీసిన వాలంటీర్లు కొన్ని గంటల్లో ప్రభుత్వానికి సమాచారం చేరవేసారు. దీంతో ప్రభుత్వం వారందర్నీ ఐసోలేట్ చేసి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ నెగిటివ్ అనేది తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని చాలావరకు అనికట్టగలిగారు. ఆంధ్రప్రదేశ్లో ఈ వైరస్ విజృంభించకపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే తాజాగా తమిళ వార్తా ఛానళ్లు ఈ నిర్ణయాన్ని పెద్దఎత్తున ప్రశంసించాయి. జగన్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఎంతో మంచి జరిగిందని, కరోనా నిరోధానికి ఎంతగానో ఉపయోగపడిందని తమిళ చానెళ్లలో చెబుతున్నారు.