దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చినట్టు తెలిపారు. తాను ఇంతటితో ఆగిపోనని, సాధ్యమయినంత వరకు సాయం చేస్తానన్నారు. స్థోమత ఉన్న వారు అవసరం ఉన్న వారికి సాయం చేయాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. టాలీవుడ్ హీరో రాజశేఖర్ కూడా సినీ కార్మికులకు 10రోజులకు సరిపడా నిత్యావసరాలు, బియ్యం అందజేసారు. ప్రకాశ్ రాజ్ బాటలో మరికొందరు తమిళనటులు తమ వద్ద పనిచేసే సిబ్బందికి ముందస్తుగా జీతాలు చెల్లిస్తున్నారు.
