కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దేశాలు ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు చేసుకున్నంత మాత్రాన సరిపోదని డబ్ల్యూహెచ్ఓ టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.ఈ వైరస్ మళ్లీ విజృంభించకుండా పూర్తిస్థాయి పబ్లిక్ హెల్త్ చర్యలు తీసుకోవడమే సరైనదని, ‘ముందుగా వైరస్ బారిన పడ్డ వాళ్లందరినీ గుర్తించడంపై ఫోకస్ పెట్టాలి. తర్వాత వాళ్లను ఐసోలేట్ చేయాలి.. ఆతర్వాత వాళ్లతో కాంటాక్ట్ అయిన వాళ్లనూ గుర్తించి ఐసోలేట్ చేయాలని” చెప్పా రు. ‘వైరస్ ను అంతం చేసేందుకు ఎక్కడికక్కడ లాక్ డౌన్స్ చేసుకుంటున్నారు. కానీ .. లాక్ డౌన్స్ ఎత్తేసిన తర్వాత వైరస్ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంటుంది. చైనాలో ఈ తరహా సమస్య వచ్చిందన్నారు. అందుకే లాక్ డౌన్స్ చేయడమేకాదు.. వైరస్ మళ్లీ చెలరేగిపోకుండా ఇప్పుడే పబ్లిక్ హెల్త్ పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి” అని ఆయన సూచించారు.