ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాసారు. కరోనా విపత్తు నేపథ్యంలో జైళ్ళలో ఉన్న ఖైదీలను బెయిల్/పెరోల్ లపై విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా సహాయక చర్యలకై రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించినందుకు అభినందనల తెలిపిన ఆయన ఒక్కో రేషన్ కార్డుకు మీరు ఇస్తానన్న వెయ్యి రూపాయల సహాయం ఏమాత్రం సరిపోదని, నలుగురు ఉన్న ప్రతి కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం నిమిత్తం ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నారని, తక్షణమే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని సర్వీస్ ఛార్జీలను నియంత్రించాలని కోరారు. ఖైదీలను విడుదల చేసేందుకు న్యాయశాఖతో సంప్రదించండి. జైళ్లలో పరిశుభ్రమైన వాతావరణం ఏ మేరకు ఉంటుందో మనకు తెలియంది కాదని, ఏ మాత్రం అలక్ష్యం ఉన్నా జైళ్లలో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని దీంతో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాలను బెయిల్ పైన, శిక్షపడిన ఖైదీలను పెరోల్ పైన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ. ముఖ్యమంత్రిని కోరారు.
